AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ ఓటమికి కారణం అదే.. విజయశాంతి సంచలన కామెంట్స్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సాధించిన గెలుపుపై ఆమె సోషల్ మీడియాలో ట్వీట్‌ చేశారు. అయితే కేసీఆర్ తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తిని తన పోస్టులో పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించిన తర్వాత గాంధీభవన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆమెను పీసీసీ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీపై పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు. కాలం కొన్ని పరిణామాలను ఎప్పుడూ నిర్దేశిస్తది. కోట్లాది మంది తెలంగాణ బిడ్డలు జీవితాలు మంచిగా ఉండాలని మనస్పూర్తిగా నిరంతరం కోరుకొనే ఒక ఉద్యమకారిణిగా సేవలు అందించాను అని విజయశాంతి చెప్పారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం ఇద్దరే ఎంపీలుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ కోసం కొట్లాడినం. అప్పటి నుంచి మా మధ్య విధానపరంగా అనేక వ్యతిరేకతలు ఉన్నా, నేను అన్నా అని పిలిచి, గౌరవంతో కలిసి పనిచేశాను. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి పొందిన స్థితికి బీఆర్ఎస్ చేరుకోవడం బాధాకరం అని విజయశాంతి అన్నారు. మొదట కేసిఆర్ ఎన్నో పర్యాయాలు చెప్పినట్లుగా, పదవికి దూరంగా ఉంటే ఈ పరిణామాలు వారికి తెలుస్తాయి అని అన్నారు. ఏదిఏమైనా ఏర్పడనున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల గౌరవంతోకూడిన ప్రతిపక్ష హుందాతనాన్ని కేసీఆర్, బీఆర్ఎస్ నుంచి ఎలా ఉంటుందనే విషయం గురించి తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్నది అని విజయశాంతి చెప్పారు.

ANN TOP 10