AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు: నేడే ప్రమాణ స్వీకారోత్సవం!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కాంగ్రెస్ నేతల బృందం ఆదివారం రాత్రి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసింది. సోమవారం శాసనసభాపక్ష సమావేశం అనంతరం సీఎల్పీ నేత పేరును నివేదిస్తామని నేతలు చెప్పినట్లు సమాచారం. గవర్నర్‌ను కలిసిన వారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తోపాటు ఆ పార్టీ ముఖ్య నేతలు డీకే శివకుమార్, మాణిక్ రావ్ ఠాక్రే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి తదితరులు ఉన్నారు. సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకారోత్సవానికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. గవర్నర్‌ను కలిసిన అనంతరం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పామని తెలిపారు. తమకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు.

ANN TOP 10