AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గజ్వేల్‌లో సీఎం కేసీఆర్, కొడంగల్‌లో, కామారెడ్డిలో రేవంత్ ముందంజ..

తెలంగాణ దంగల్ చివరి దశకు చేరుకుంది. 119 నియోజకవర్గాలకు కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభమైంది. ముందుగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కొనసాగింది.. ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అశ్వారావుపేట నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ1748 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4000ల ఓట్లతో ముందంజలో ఉన్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి తొలి రౌండ్లో లీడ్ లో కొనసాగుతున్నారు. మధిరలో భట్టి విక్రమార్కల ముందంజలో ఉన్నారు. గజ్వేల్ లో సీఎం కేసీఆర్, సిద్ధిపేటలో హరీశ్ రావు ముందంజలో కొనసాగుతున్నారు. కొడంగల్‌లో ఐదో రౌండ్‌ ముగిసే సరికి 5687 కాంగ్రెస్‌ లీడ్‌ లో ఉంది.

కొల్లాపూర్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ మొదటి రౌండ్లో జూపల్లి కృష్ణారావు ముందంజలో కొనసాగుతున్నారు. ఆలేరులో తొలి రౌండ్ కాంగ్రెస్ 760ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2000 ఓట్లతో ముందంజలో ఉన్నారు. జుక్కల్ బిఆర్ఎస్ లీడ్ 3143, సూర్యాపేటలో తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్ రెడ్డి 2 వేల ఓట్లతో ముందంజలో ఉన్నారు. వైరా కాంగ్రెస్ అభ్యర్థి 1354 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. వనపర్తి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.

ANN TOP 10