AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ రెడ్డికి డబుల్ బొనాంజా.. కాంగ్రెస్‌లో జోష్ మామూలుగా లేదుగా..

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) గాలి వీస్తోంది. ఓటర్లు బీఆర్ఎస్‌కి షాకిస్తూ.. హస్తం పార్టీని ఆదరించారు. ఇప్పటికున్న ట్రెండ్స్ బట్టి.. కాంగ్రెస్ పార్టీ 60కి పైగా స్థానాల్లో విజయం సాధించబోతున్నట్లు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ 40 స్థానాలకు లోపే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీని ముందుండి నడింపించిన రేవంత్ రెడ్డి కూడా.. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నారు.

ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీ చేశారు. ఎప్పుడూ పోటీ చేసే కొడంగల్‌తో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టారు. ఈ రెండు నియోజకవర్గాల్లోకూ రేవంత్ రెడ్డి లీడింగ్‌లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు రేవంత్ రెడ్డి చోట్లా లీడింగ్‌లో ఉండడంతో… హస్తం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అన్ని చోట్లా వేడుకలు ప్రారంభమయ్యాయి.

ANN TOP 10