AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్‌ ఇంటి వద్ద సంబరాలు… మోగుతున్న టపాసుల మోత

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి కాంగ్రెస్ ఆధిక్యత చూపుతోంది. వార్ వన్‌సైడ్ అన్నట్టుగా తెలంగాణలో ఫలితాలు వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఆనందం వెల్లువిరిసింది. ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తుండటంతో జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. రేవంత్ నివాసం వద్ద టపాసులు కాల్చి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేస్తున్నారు. రేవంత్ నివాసానికి కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు.

ANN TOP 10