తెలంగాణ ఎన్నికల్లో సంచలన ఫలితాలు వస్తున్నాయి. కాంగ్రెస్ వార్ వన్ సైడ్ అయినట్లే కనిపిస్తోంది. పెద్ద పెద్ద నేతలు సైతం వెనుకంజలో ఉన్నారు . ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) రెండు చోట్ల వెనుకంజలో ఉండడం ఆసక్తి రేపుతోంది. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీచేశారు. గజ్వేల్‌లో కేసీఆర్‌పై బీజేపీ తరపున ఈటల రాజేందర్ (Eatala Rajender), కాంగ్రెస్ నుంచి తూంకుంట నర్సారెడ్డి పోటీ చేశారు. ఈ ముగ్గురిలో ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు.
అటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై బీజేపీ తరపున వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురిలో అక్కడ రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. సీఎం కేసీఆర్, వెంకటరమణారెడ్డి వెనకబడ్డారు. దీనిని బట్టి సీఎం కేసీఆర్.. రెండు చోట్లా వెనుకంజలో ఉన్నారు. గజ్వేల్‌లో బీజేపీ ముందుంటే.. కామారెడ్డిలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.









