AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడు ఒకే జిల్లాలో మోదీ, కేసీఆర్ సభలు..

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ నేడు ఒకే జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నిర్మల్ పట్టణంలో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డికి మద్దతుగా మోదీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మరోవైపు ఖానాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు మద్దతుగా సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రధాని, సీఎంల సభల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, నేడు నాలుగు ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

ఇవాళ ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకల్లో ప్రచారం నిర్వహించ నున్నారు. ఇప్పటి వరకు 86 సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. 27న షాద్ నగర్, చేవెళ్ల, అందోలు, సంగారెడ్డి. 28న వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలు కలిపి ఒకే చోట సభలు నిర్వహించనున్నారు. అనంతరం గజ్వేల్ సభతో సీఎం ప్రచారం ముగియనుంది.

ANN TOP 10