AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మీకు ఇంకా ఓటర్‌ స్లిప్‌ రాలేదా.? మీరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న ఓటర్లందరికీ ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేసింది. ఇంటింటికీ అధికారులు వెళ్లి ఈ స్లిప్పులను అందించారు. ఈ ప్రక్రియ నవంబర్‌ 25వ తేదీ (నిన్నటి)తో ముగిసింది. అయితే ఇప్పటికీ కొన్ని అనివార్య కారణాలతో కొందరికి ఓటర్‌ స్లిప్పులు అందని పరిస్థితి నెలకొంది. అసలు ఓటు హక్కు ఉందా.? లేదా.? ఉంటే ఏ పోలింగ్ కేంద్రంలో వేటు వేయాలనే వివరాలన్నీ ఈ స్లిప్స్‌లోనే పేర్కొంటారు. మరి ఓటర్‌ స్లిప్‌ లేకపోతే ఓటు వేసేది ఎలా.? ఇలాంటి వారి కోసమే ఎన్నికల సంఘం ఓ అవకాశాన్ని కల్పించింది.

ఓటర్లే నేరుగా తమ ఓటర్‌ స్లిప్పులను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకును వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం ముందుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం అక్కడ అడిగిన సమాచారాన్ని అందించాలి. దీంతో వెంటనే ఓటరు వివరాలు, సీరియల్‌ నంబర్‌, పోలింగ్‌ కేంద్రం, పోలింగ్‌ సమయం, పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌ తదితర వివరాలు డిస్‌ప్లే అవుతాయి. ఓటరు నమోదు సమయంలో ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌ సాయంతో స్లిప్పును పొందొచ్చు. ఈ స్లిప్‌ను ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.

ఓటు వేసు సమయంలో ఈ స్లిప్‌తో పాటు.. ఓటరు కార్డును తీసుకెళ్లాలి. ఒకవేళ ఓటర్‌ కార్డ్‌ అందుబాటులో లేకపోతే, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ బుక్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, పాస్‌పోర్టుతో పాటు 12 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా పోలింగ్ అధికారికి చూపించి ఓటు వేయొచ్చు. ఇక వెబ్‌సైట్‌తోనే కాకుండా ‘ఓటర్‌ హెల్ప్‌లైన్‌’ యాప్‌లోనూ ఓటర్‌ స్లిప్‌ పొందొచ్చు.

ఇందుకోసం ముందుగా ప్లేస్టోర్‌ నుంచి ‘ఓటర్‌ హెల్ప్‌లైన్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం ఆ యాప్‌ సాయంతో ఓటరు కార్డుపై ఉండే క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. లేదా ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ ఎంటర్‌ చేయాలి. వెంటనే మీ వివరాలతోపాటు పోలింగ్‌ కేంద్రం, సమయం తదితర వివరాలన్నీ పొందవచ్చు. స్లిప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు.

ANN TOP 10