AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ రిజర్వేషన్లు రద్దు చేస్తాం: ఎన్నికల ప్రచారంలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు

దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కారేనని అన్నారు కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాష్ట్రంలో పర్యటిస్తున్న అమిత్ షా ఆర్మూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ముస్లింలకు 4 శాతం మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చారని.. బీజేపీ ప్రభుత్వం రాగానే ఆ రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు. పసుపు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తోందన్నారు. పసుపు బోర్డ్ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు.

పసుపు ఎగుమతులతోపాటు పరిశోధనలు కూడా జరుగుతాయని అమిత్ షా వెల్లడించారు. నిజామాబాద్ బీడీ కార్మికుల కోసం ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉత్తర తెలంగాణ నుంచి లక్షలాదిగా గల్ఫ్, విదేశాలకు వలస వెళ్తున్నారన్న అమిత్ షా.. వలస వెళ్లే కార్మికుల కోసం ఎన్నారై మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు బస్ డిపో భూమిని కబ్జా చేశారని అమిత్ షా ఆరోపించారు. బస్సు డిపో భూమి కబ్జా చేసి షాపింగ్ సెంటర్ ఏర్పాటు చేశారని.. ఆ షాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన నేతకు బీఆర్ఎస్ టికెట్ ఎందుకు ఇచ్చిందని కేంద్రమంత్రి ప్రశ్నించారు. బీఆర్ఎస్ టికెట్ కోసం డీలింగ్ ఉంటుందని ప్రజలు తెలుసుకోవాలని అమిత్ షా అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10