AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గోవా అభయారణ్యంలో కార్చిచ్చు..

గోవా అడవుల్లో కార్చిచ్చు రగిలి.. మంటలకు ఎకరాల కొద్దీ అటవీ ప్రాంతం తగలబడిపోతుంది. అక్కడ మాదై వైల్డ్ లైఫ్ సాంక్చుయరీలో గత ఆరు రోజులుగా మంటలు ఎగసిపడటంతో పచ్చటి అడవులు మంటలకు మల మల మాడి మసి అవుతున్నాయి. మూగజీవాల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. మంటలను ఆర్పేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ హెలికాఫ్టర్లను కేంద్రం రంగంలోకి దింపింది. సమీపంలోని రిజర్వాయర్లలోని నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పుతున్నా ఫలితం కనిపించటం లేదు. అటవీ ప్రాంత సమీపంలోని స్థానికులు కూడా మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

గత ఆరు రోజుల నుంచి గోవా అభయారణ్యంలో మంటలు ఎగసిపడటంతో పచ్చటి అడవులు మాడి మసి అవుతున్నాయి. మూగజీవాల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. గోవా ప్రభుత్వం విన్నపంతో నేవీ, ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దిగాయి.

ANN TOP 10