AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ కు భారీ షాక్‌..

– కాంగ్రెస్‌ బాట పడుతున్న మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు

ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీకి పలువురు నేతలు గుడ్‌ బై చెప్పారు. మనుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మున్సిపల్‌ చైర్మన్లు ఎంపీపీలు, జెడ్పీటీసీలు బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడామో ఇప్పుడు ఆ ఆత్మగౌరవం కరువైందన్నారు. ఒకే కుటుంబం చేతిలోకి తెలంగాణ వెళ్లిపోయిందన్నారు. ఆత్మగౌరం కోసం కాంగ్రెస్‌ లోకి వస్తున్నవారిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. మీ లక్ష్యం మా లక్ష్యం సేవా, అభివృద్ధి అని అన్నారు. పాత, కొత్త అని తేడా లేకుండా కలిసి పనిచేసి మునుగోడును అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

ప్రజల మీద విశ్వాసంతో మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని రాజగోపాల్‌ అన్నారు. దుర్మార్గపు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అన్నారు. అందరం కలిసి పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ఆత్మగౌరవ జెండా ఎగరేద్దామని పిలుపునిచ్చారు.

ANN TOP 10