తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ.. 14 మందితో తుది జాబితాని విడుదల చేసింది. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో… బీజేపీ ఇప్పుడు ఈ జాబితాను రిలీజ్ చేసింది.
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. ఈలోగా అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో బీజేపీ ఇవాళ్టి వరకూ తుది జాబితాను ప్రకటించకుండా ఆలస్యం చేసింది. ఇందుకు ప్రధాన కారణం.. జనసేనతో సీట్ల సర్దుబాటుపై జరిగిన చర్చలే. చివరకు.. జాబితాను ప్రకటించింది. ఈ 14 మంది అభ్యర్థులు ఇప్పుడు హడావుడిగా నామినేషన్ పత్రాలు ఫిలప్ చేసి, సమర్పించాల్సి ఉంటుంది.
బీజేపీ చివరి జాబితా
ఈ ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా… బీజేపీ, జనసేనకు 8 సీట్లను ఇచ్చింది. మిగతా 111 స్థానాల్లో బీజేపీ నేతలు బరిలో దిగుతున్నారు.










