రష్మిక మందన్నకి సంబంధించిన మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై సినీ రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే అమితాబ్ బచ్చన్, సాయి ధరమ్ తేజ్, నాగచైతన్య, చిన్మయి తదితరులు ఫిలిం స్టార్స్ రియాక్ట్ అవుతూ వస్తున్నారు. అలా చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక తాజాగా విషయం పై రష్మిక క్లోజ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ కూడా రియాక్ట్ అవుతూ పోస్టు వేసాడు.
విజయ్ ఈ విషయం పై ఫైర్ అవుతూ తన ఇన్‌స్టా స్టోరీలో ఇలా రాసుకొచ్చాడు.. “ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే సైబర్ డిపార్ట్మెంట్ లో ఇలాంటివి త్వరగా అరికట్టేలా, వాటికీ పాల్పడిన వారిని వెంటనే శిక్షించేలా చట్టం తీసుకు రావాలి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.









