AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వివాహ బంధంతో ఒక్కటైన నరేష్-పవిత్ర

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్ర లోకేశ్ వివాహ బంధంలో అడుగుపెట్టారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. తాము కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టు గతేడాది డిసెంబర్ 31న నరేశ్ ప్రకటించారు. పవిత్రను ముద్దు పెడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా ఈ ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అతి కొద్ది మంది సమక్షంలో సంప్రదాయ బద్దంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను నరేశ్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. తమకు పెళ్లి అయిన విషయాన్ని వెల్లడించారు. ‘ఒక పవిత్ర బంధం. రెండు మనసులు. మూడు ముడ్లు. ఏడు అడుగులు. మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు పవిత్ర నరేశ్’ అని ట్వీట్ చేశారు.

ANN TOP 10