కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించడానికి గురువారం వస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గత నెల 21న మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగిపోగా, తాజాగా అన్నారం సరస్వతి బ్యారేజ్ వద్ద బుంగ పడి నీరు లికేజ్ అవుతోంది. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాహుల్ మేడిగడ్డ సందర్శనకు వస్తున్నట్లుగా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అంబటి పల్లిలో నిర్వహించేందుకు మంథని ఎన్నికల అధికారి శంకర్ నాయక్ వద్ద అనుమతులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాహుల్ తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ మేనిపేస్టో చైర్మన్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు హాజరుకానున్నట్లుగా తెలిపారు.
