బీహార్ లోని సరణ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సరయూ నదిలో ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో 18 మంది జాడ గల్లంతైంది. వ్యవసాయ పనులు ముగించుకుని వీరంతా వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న పడవను ఒక అల బలంగా తాకడంతో పడవ తలకిందులైనట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే డీఎం, ఎస్‌పీ, జిల్లా ఎస్‌డీఎం సహా సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
