తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. జాతీయ స్థాయి నేతలతో తెలంగాణలో పర్యటించేలా ప్లాన్ చేస్తుంది. ప్రణాళికలో భాగంగా ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీతో ఎన్నికల ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేశారు. మరికాసేపట్లో కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజాభేరి సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అయితే ప్రియాంక గాంధీతో మొదట ఎన్నికల ప్రచారం నిర్వహించేలా ప్లాన్ చేశారు కానీ.. అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ పర్యటన రద్దు అయ్యినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ప్రియాంక గాంధీకి అనారోగ్య కారణాలతో ఈ పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, డీకే శివ కుమార్ తదితర నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
