బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. వారం రోజుల తర్వాత బంగారం ధర పడిపోయింది. గత వారం రోజులుగా రోజు రోజుకు పెరుగుతూ రికార్డు గరిష్ఠాలకు చేరిన పసిడి ధరలు.. ఇవాళ తగ్గాయి. గ్లోబల్ మార్కెట్లో ధరలు కాస్త దిగిరావడంతో దేశీయంగా రేట్లు పడిపోయినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. బంగారం ధర ఇవాళ దిగివచ్చినప్పటికీ వెండి రేటు మాత్రం భారీగా పెరిగింది. కిలో వెండి ధర ఏకంగా రూ.1000 మేర పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్, ఢిల్లీ సహా ఇతర బులియన మార్కెట్లలో అక్టోబర్ 31న గోల్డ్, సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధర..
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వారం తర్వాత దిగివచ్చాయి. ఇవాళ 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 210 తగ్గి రూ. 57 వేల 200 మార్క్ వద్దకు చేరింది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 230 మేర పడిపోయింది. ప్రస్తుతం ప్యూర్ గోల్డ్ తులానికి రూ. 62 వేల 400 మార్క్ వద్ద ట్రేడింగ్ అవుతోంది.
హైదరాబాద్‌లో రూ.1000 పెరిగిన కిలో వెండి
వెండి కంటతడి పెట్టించినంత పని చేసింది. ఇటీవల కాస్త తగ్గినట్లు కనిపించిన వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. కిలో వెండి రేటు హైదరాబాద్‌లో ఇవాళ రూ.1000 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 78 వేల 500 మార్క్ వద్దకు చేరింది.