AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ పార్టీ ఎవరికీ భయపడదు

కాంగ్రెస్ పార్టీ ఎవరికీ భయపడదు.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జనఖర్గే అన్నారు. ఆదివారం నాడు కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్ర మెదక్‌ పట్టణంలోని రాందాస్ చౌరస్తాకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, రేవంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్లికార్జునఖర్గే మీడియాతో మాట్లాడుతూ…‘‘30లక్షల ఊగ్యోగలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో మోదీ ప్రభుత్వం ఆడుకుంటుుంది. బీఆర్ఎస్ ‘బీ ‘టీం బీజేపీ. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరుగ్యోగుల పక్షాన విద్యార్థుల పక్షాన, రైతుల పక్షాన పోరాటం చేసే పార్టీ. అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ నీ అధికారంలోకి తీసుకురావాలి.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం ఖాయం. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయి. ఏమైనా అనుమానం ఉంటే మా సోదరులు ఉచితంగా బస్సు ఏర్పాటు చేస్తారు కర్ణాటకలో ఎక్కడ అడుగున హామీల గురించి చెప్తారు. ప్రజల బతుకులు మారాలంటే రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి’’ అని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.

ANN TOP 10