మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటు ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరో లేఖ రాసింది. కేంద్ర జలశక్తి శాఖ కమిటీ ప్రాజెక్టు ఆదివారంలోగా ఘటనపై తాము కోరిన సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు తర్వాత బ్యారేజీని జాతీయ డ్యామ్ సేప్టీ అథారిటీ ఆధ్వర్యంలోని కేంద్ర బృందం ఈనెల 23 నుంచి 26 వరకు సందర్శించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత సమాచారం ఇచ్చింది. అయితే, కమిటీ తిరుగు పయణంలో వారు అడిగిన మరికొన్ని వివరాలు ఇవ్వకపోవడంతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖరాసినట్లు తెలిసింది.









