న్యూఢిల్లీ: కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. శుక్రవారం ఉదయం ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ సీఈసీ భేటీలో తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చ జరిగింది. 60 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం. మూడు రోజులుగా జరిగిన కసరత్తును ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ .. సీఈసీ ముందు పెట్టారు. పార్టీలో చేరికలు దాదాపు పూర్తి కావడంతో… అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ దృష్టి సారించారు.
కాగా.. సీఈసీ భేటీకి ముందు పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో పలువురు నేతలు పార్టీలో చేరారు. మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్‌లు కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. ఈరోజు సాయంత్రానికి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు.









