తెలంగాణ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది పక్కన పెడితే, ఆయన వరకూ ఆయన భారీగా ప్రచారం చేస్తున్నారు. గ్యాప్ లేకుండా తిరుగుతున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వరుస బహిరంగ సభల్లో పాల్గొని.. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇవాళ ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్‌తోపాటూ, వర్ధన్నపేట నియోజకవర్గం భట్టుపల్లిలో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించబోతున్నారు.
హైదరాబాద్, కరీంనగర్ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాని బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ ఏకంగా 12 అసెంబ్లీ స్థానాలున్నాయి. అన్నింటినీ గెలవాలన్నదే పార్టీ ప్లాన్. అందుకే స్వయంగా కేసీఆర్ ప్రచార బరిలో దిగారు. ఇవాళ్టి మహబూబాబాద్ సభకు కనీసం 70 వేల మంది వచ్చేలా ప్లాన్ చేశారు.









