AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వెంకటేశ్‌ రెండో కుమార్తె నిశ్చితార్థం.. హాజరైన సినీ ప్రముఖులు

టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ ఇంట్లో త్వరలోనే పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఆయన రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్థం ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌ కుమారుడితో వెంకటేష్ స్వగృహంలోనే ఈ వేడుక నిర్వహించారు. వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి జరగనున్నట్లు సమాచారం.

ఇక ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి, మహేశ్‌ బాబు, రానా, నాగచైతన్య ఈ నిశ్చితార్థానికి హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక వెంకటేశ్‌, నీరజ దంపతులకు నలుగురు పిల్లలు. ఆశ్రిత, హయ వాహిని, భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్ద కుమార్తె పెళ్లి 2019లో జరిగింది. ప్రస్తుతం ఆమె విదేశాల్లో ఉంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. వెంకటేష్ ‘సైంధవ్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఇది రానుంది. దీన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నారు.

ANN TOP 10