AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాలేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు పొన్నం బృందం

హుస్నాబాద్ నుంచి కాలేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుకు సందర్శనకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ బృందం బుధవారం ఉదయం బయలుదేరింది. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలను నాణ్యత లోపాలను పరిశీలించేందుకు వెళ్తున్నామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు కాలేశ్వరం ద్వారా నీళ్లు వస్తాయని ఆశిస్తున్న హుస్నాబాద్ ప్రజల ఆందోళన ఇప్పటికే 10 ఏళ్ల కాలయాపన జరిగిందని, ఇప్పుడు ప్రాజెక్టు కొంతమేర కుంగి పోయిందన్న ఆందోళనలో హుస్నాబాద్ ప్రాంత రైతాంగం ఉందని పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ లక్మీబ్యారేజీ వంతెన కుంగడంపై అధికారులు విచారణ చేపట్టారు. 19, 20, 21 పిల్లర్లు కుంగినట్టు నిర్థారించారు. నిర్మాణ లోపమా?, మరేదైన కారణమా? ఉందా అన్నది అధికారులు తెలుసుకుంటున్నారు.

ANN TOP 10