చెన్నైలోని ఆవడి వద్ద లోకల్ ట్రైన్ పట్టాలు తప్పింది. అన్ననూర్ వర్క్షాప్ నుంచి ఆవడికి వెళ్తుండగా నాలుగు కోచ్లు ఒక్కసారిగా పట్టాలు తప్పాయి.ఈ మేరకు మెరీనా బీచ్ కు వెళ్లే ఈ రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సిగ్నల్ సేవలు దెబ్బతిన్నాయి. రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.









