AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం కేసీఆర్ పై 100 మంది కామారెడ్డి జిల్లా రైతులు పోటీ!

వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పై పోటీకి కామారెడ్డి జిల్లా రైతులు సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్ పై పోటీకి 100 మంది రైతులు రెడీ అయ్యారు. సీఎం కేసీఆర్ పై నామినేషన్లు వేస్తామని కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు ప్రకటించారు. ప్రతి గ్రామం నుంచి 15 మంది చొప్పున 100 మంది రైతులు నామినేషన్లు వేయాలని తీర్మానం చేశారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను రైతులు వ్యతిరేకిస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ భేటీ జరిగింది. ఆయా గ్రామాల రైతుల నుంచి సలహాలు స్వీకరించారు. తమ భూములను కాపాడుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామని తేగేసి చెప్పారు.

తమ భూములను కాపాడుకునే విషయంలో వెనక్కి తగ్గబోమన్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేశాకే కేసీఆర్ కామారెడ్డికి రావాలని రైతులు అంటున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు గవర్నర్ ద్వారా చెప్పించాలని రైతులు స్పష్టం చేశారు.

ANN TOP 10