AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పండుగ సంబురాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా..

పండుగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. పండుగ సంబురాల్లో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులు ప్రాణాలు వదిలారు. ఈ విషాదకర ఘటన.. మంచిర్యాల జిల్లా జన్నారంలో జరిగింది. జన్నారం మండలం పున్‌కల్‌ గ్రామానికి చెందిన కుంపర్ల రాహిత్య (15), వరాల సాత్విక (19) సోమవారం రోజున పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ ఆటలు ఆడుకుని సంతోషంగా గడిపారు. అనంతరం.. రాహిత్య తండ్రి గంగన్నతో కలిసి బైక్ మీద ఇద్దరు ఇంటికి వెళ్తుండగా.. పాత పున్‌కల్‌ దగ్గరికి రాగానే గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది.

అయితే.. ఈ ప్రమాదంలో గంగన్నకు స్వల్ప గాయాలు కాగా.. ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. స్థానికులు వాళ్లను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం ఇద్దరు మృతి చెందారు. రాహిత్య పదో తరగతి చదువుతుండగా.. సాత్విక నీట్‌ శిక్షణ తీసుకుంటోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ANN TOP 10