AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ యాత్రకు బస్సు రెడీ.. నారావారిపల్లెలో ప్రత్యేక పూజలు

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టనున్న ‘నిజం గెలవాలి’ యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈ యాత్రకు ఆమె శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్రకు సంబంధించిన బస్సును ఇప్పటికే సిద్ధం చేశారు. బస్సుపై ఎన్టీఆర్‌, చంద్రబాబు, భువనేశ్వరి ఫొటోలతో కూడిన థీమ్‌ ఉంది. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు. ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా వారానికి మూడు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తారు. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ భువనేశ్వరి పాల్గొంటారు. భువనేశ్వరిమంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు

ANN TOP 10