తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం 14వ డివిజన్ ఆత్మీయ సమావేశంలో తుమ్మల మాట్లాడారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న అరాచక, అవినీతి, నిర్బంధ పాలన నా జీవితంలో చూడలేదు. ప్రతీకార రాజకీయం నా నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ పాల్పడలేదు. ప్రజలు కోరుకునే పాలన ఇవ్వాలి కానీ బెదిరించి, అదిరించి ఎల్లకాలం చేయలేరు. ఖమ్మంలో అరాచక పాలనపై ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉంది. ఎన్నికల్లో సుస్థిర పాలన కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి.’’ అని తుమ్మల ప్రజలకు పిలుపునిచ్చారు.









