ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. స్థానిక దాసారం బస్తీలో తెల్లవారుజామున దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో షరీఫ్ అనే రౌడీ షీటర్ తరుణ్‌పై బండరాళ్లపై షేక్ షరీఫ్ అనే రౌడీ షీటర్ దాడికి పాల్పడ్డాడు. స్థానికులు అప్రమత్తం కావడంతో అరవడంతో దుండగులు పరారయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తరుణ్ ను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తరుణ్ మృతి చెందాడు. తరుణ్ డెడ్ బాడీని పోలీసులు గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. నిందితుడు షేక్ షరీఫ్‌ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ, ఎస్ఆర్ నగర్ ఏసీపీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
