గగన్‌యాన్ మిషన్‌లో (Gaganyaan) కీలకమైన తొలిదశ ప్రయోగం టీవీ-డీ1 (టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1) చివరి క్షణాల్లో ఆకస్మాత్తుగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. సాంకేతిక లోపంతో టెస్ట్ వెహికల్ ఆగిపోయినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించగా.. గంట వ్యవధిలోనే ప్రయోగం ఎప్పుడనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా ఇస్రో ప్రకటించింది. సాంకేతిక లోపం ఎక్కడనే విషయాన్ని గుర్తించి శాస్త్రవేత్తలు సరిచేశారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రయోగిస్తామని ట్వీట్‌లో ఇస్రో తెలిపింది. సరిగ్గా 10 గంటలకు రాకెట్ ప్రయోగించగా నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా 10 గంటలకు రాకెట్ ప్రయోగించగా నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. మరో నాలుగైదు గంటల తరువాత క్రూమాడ్యూల్ భూమికి చేరుకోనున్నది.
ప్రయోగం పూర్తయ్యాక..!
మానవ సహిత గగన్‌యాన్ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా మానవ రహితంగా ఇస్రో చేపడుతున్న కీలక ప్రయోగమిదనే విషయం తెలిసిందే. టీవీ-డీ1 రాకెట్ భూమి నుంచి నిర్దేశిత ఎత్తుకు చేరిన తర్వాత క్రూ మాడ్యూల్ విడిపోనుంది. క్రూమాడ్యూల్ బరువు 4520 కిలోలు.. భూమి నుంచి 17 కి.మీ ఎత్తులో రాకెట్ నుంచి విడిపోనున్నది. ఐదారు గంటలకి తిరిగి భూమిని చేరేలా డిజైన్ చేయడం జరిగింది. షార్ కేంద్రానికి 10కి.మీ దూరంలో అమర్చిన పారాచూట్ల సాయంతో నెమ్మదిగా దాన్ని బంగాళాఖాతం సముద్రంలోకి దింపుతారు. ఇండియన్ నావీ సహకారంతో క్రూమాడ్యుల్‌ను ఇస్రో సేకరించనున్నది. గగన్‌యాన్ ప్రయోగంలో అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపినప్పుడు వారిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు ఈ క్రూఎస్కేప్ వ్యవస్థను ఉపయోగించనుంది.