AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంబరాన్నంటిన సద్దుల సంబురం

తెలంగాణ అంతటా ఆదివారం నిర్వహించిన పెద్ద బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఊరూవాడ పూలవనంగా మారింది. తీరొక్క పూలతో పేర్చిన పెద్ద బతుకమ్మలు ఆకట్టుకున్నాయి. మహిళల ఆటపాటలు అలరించాయి. పోయిరా.. బతుకమ్మ పోయిరా.. గౌరమ్మ అంటూ చెరువుల్లో నిమజ్జనం చేశారు. మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సద్దులను ఆరగించి సంబురాల్లో మునిగితేలారు. సిద్దిపేట పట్టణంలో బతుకమ్మ వేడుకల్లో మంత్రి హరీశ్‌రావు, ఆయన సతీమణి పాల్గొన్నారు. ఆమె స్థానిక ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు. కోమటిచెరువు వద్ద నిమజ్జన వేడుకల్లోనూ పాలుపంచుకున్నారు. హుస్నాబాద్‌ పట్టణంలో ఎల్లమ్మచెరువు కట్ట జనసంద్రంగా మారింది. ఎటు చూసిన బతుకమ్మ ఆడుతున్న మహిళలతో కిక్కిరిసిపోయింది. ఎమ్మెల్యే వొడితెల సతీ్‌షకుమార్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ చెరువు కట్టపై కలుసుకుని పలకరించుకున్నారు.

ANN TOP 10