వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా నేడు టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ తడబడుతూ ఆడుతుంది. తొలి ఓవర్ లోనే బూమ్రా మెడిన్ ఓవర్ వేశాడు. 3 ఓవర్లో సిరాజ్ బౌలింగ్ లో కాన్వే (0) డకౌట్ గా వెనుదిరిగాడు. 19 పరుగుల వద్ద షమి తన తోలి ఓవర్ తొలి బంతికే విలియమ్ అలెక్సాండార్ (17)ను బౌల్డ్ చేశాడు. దీంతో 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్. ప్రస్తుతం జట్టు స్కోరు 9 ఓవర్లకు 26/2గా ఉంది. క్రీజులో రచిన్ రవింద్ర 6, మిచెల్ 3 పరుగులతో ఉన్నారు.









