AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసుల్లో కేసీఆర్ నెం.1.. ఏడీఆర్ సంచలన నివేదిక..

అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) సంచలన నివేదిక వెలువరించింది. కేసుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నెంబర్ 1 అని, ఆయనపై అందరికన్నా అత్యధికంగా 64 కేసులు నమోదయ్యాయని, సీరియస్ ఐపీఎస్ సెక్షన్లు 37 నమోదు కాగా, ఇతర సెక్షన్లు 283 నమోదయ్యాయని ఏడీఆర్ పేర్కొంది.

ఆస్తుల్లో కేటీఆర్ (KTR) 9వ స్థానంలో, సీఎం కేసీఆర్ ఆదాయంలో 10వ స్థానంలో ఉన్నారని ఏడీఆర్ పేర్కొంది. 59 మంది బీఆర్ఎస్ (BRS) సిట్టింగ్ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, అత్యధిక ఆస్తుల్లో మొదటి మూడు స్థానాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధనరెడ్డి, ఉపేందర్ రెడ్డి, పి.శేఖర్ రెడ్డి ఉన్నారని పేర్కొంది. 118 మంది ఎమ్మెల్యేల్లో 72 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని…ఇందులో 59 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, 46 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఇందులో 38 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారని, మరో 7గురిపైన హత్యానేరం కేసులు ఉన్నాయని పేర్కొంది. 93 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కోటీశ్వరులని, ఎంఐఎం (MIM) ఎమ్మెల్యేలు ఐదుగురు, 4గురు కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలు కోటీశ్వరులని ఏడీఆర్ నివేదికలో పేర్కొంది.

కాగా దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ సంచలన నివేదిక వెలువరించింది. మహారాష్ట్ర (Maharashtra) మంత్రుల్లో (Ministers) 20 మంది మంత్రులకు గాను 13 మందిపై, జార్ఖండ్‌(Jharkhand)లోని 11 మంది మంత్రులకు గాను ఏడుగురిపై, తెలంగాణ(Telangana)లో 17 మంది మంత్రులకు గాను 10 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయని (serious criminal cases) నివేదిక వెల్లడించింది.

558 మంది ఎమ్మెల్యేల్లో 486 మంది కోటీశ్వరులని నివేదిక తెలిపింది. 239 మంది మంత్రులు తమపై క్రిమినల్ కేసులున్నాయని స్వయంగా వారే వెల్లడించారు. తెలంగాణలోని 13 మంది మంత్రులు, తమిళనాడులోని(Tamil Nadu) 33 మంది మంత్రుల్లో 28 మంది, బీహార్‌( Bihar)లోని 21 మంది మంత్రులు, పంజాబ్‌(Punjab)లోని 11 మంది మంత్రులు తమపై క్రిమినల్ కేసులున్నాయని స్వయంగా తమ అఫిడవిట్‌లలో వెల్లడించారు.

28 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 567 మంత్రులకు గాను 558 మంత్రుల అఫిడవిట్‌లను పరిశీలించి ఈ నివేదిక తయారు చేశారు.

ANN TOP 10