తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో విడత జాబితాపై కసరత్తు ముగిసింది. అభ్యర్థులపై జాబితాపై ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. రెండో జాబితాపై సుదీర్ఘంగా చర్చించింది. దాదాపు 5 గంటలపాటు సమావేశం కొనసాగింది. ప్రధానంగా 64 స్థానాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
వివాదం లేని సీట్లపై చర్చించి రెండో విడత జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే అభ్యర్థుల రెండో విడత జాబితాను దసరా తర్వాతే విడుదల చేసే అవకాశం ఉంది. మరోసారి అభ్యర్థులపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది. వామపక్షాల స్థానాలపైన కాంగ్రెస్ పార్టీ నేతల్లో స్పష్టత రాలేదు.
వామపక్షాలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి? ఏ ఏ సీట్లు ఇవ్వాలన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. వామపక్షాలతో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వామపక్షాలతో చర్చలు జరుపనున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం హైదరాబాద్ కు రాబోతున్నారు.









