AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజాసింగ్‌కు గుడ్‌న్యూస్.. సస్పెన్షన్ ఎత్తివేత

అధిష్టానం నిర్ణయం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గుడ్‌న్యూస్. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా గతంలో ఆయనపై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ గతంలో రాజా సింగ్‌కు పార్టీ హైకమాండ్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. దానికి రాజా సింగ్ ఇచ్చిన వివరణ పట్ల బీజేపీ నాయకత్వం సంతృప్తి చెందింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ ఆదివారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది.

కాగా ఆగస్టు 23, 2022న‌ రాజసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ విధించింది. దాదాపు 14 నెలల తర్వాత తాజాగా ఎత్తివేసింది. ఇదిలావుండగా బీజేపీ ప్రకటించనున్న తొలి జాబితాలోనే రాజా సింగ్ పేరు ఉండొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ స్థానం నుంచి యథావిథిగా పోటీ చేయించాలని నాయకత్వం భావిస్తున్నట్టు రిపోర్టులు వెలువడుతున్నాయి.

ANN TOP 10