ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా రెగుల్యర్ బావుమా అనారోగ్యం కారణంగా ఈరోజు మ్యాచ్ లో ఆడటం లేదు. ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. బావుమా ప్లేస్ లో రీజా హెండ్రిక్స్ జట్టులోకి వచ్చాడు.
బరిలోకి బెన్ స్టోక్స్
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో మరో కీలక సమరానికి తెర లేచింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు కీలక మ్యాచ్ ఆడుతున్నాయి. డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడి ఒక్క విజయం మాత్రమే అందుకుంది. పాయింట్ల పట్టిక ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈరోజు మ్యాచ్ లో గెలిచి ముందుకెళ్లాలని ఇంగ్లీష్ టీమ్ భావిస్తోంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఈరోజు బరిలోకి దిగనున్నాడు.
మరోవైపు తాము ఆడిన మొదటి రెండు మ్యాచ్ ల్లో దుమ్మురేపిన సౌతాఫ్రికా మూడో మ్యాచ్ లో అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో భంగపాటుకు గురైంది. ఆ షాకు నుంచి కోలుకోవాలంటే ఈరోజు మ్యాచ్ లో విజయం తప్పనిసరి.