AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ఢిల్లీ: బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ సమావేశం కొనసాగింది. సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌ షా, రాజనాధ్‌ సింగ్, శివరాజ్‌ సింగ్‌ చౌహన్, లక్ష్మణ్, పలువురు హాజరయ్యారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ తోపాటు తెలంగాణ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై చర్చ జరిగింది. శనివారం బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాబితాలో బీసీ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయ్యింది.

తెలంగాణ,రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై చర్చ చర్చ జరిగింది. తెలంగాణ నుంచి 60–70 మంది అభ్యర్థులు తొలి జాబితాలో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. టికెట్ల కేటాయింపులో బీసీలు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయానికి మూడు రాష్ట్రాల కోర్‌ కమిటీలు చేరుకున్నాయి. తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై రాష్ట్ర కోర్‌ కమిటీ రూపొందించిన అభ్యర్థులను పరిశీలించి తుది అభ్యర్థులను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేయనున్నది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10