గాంధీ మెడికల్ కాలేజ్‌లో ర్యాగింగ్‌కు పాల్పడిన మరో విద్యార్థిని యాంటీ ర్యాగింగ్ కమిటీ సస్పెండ్ చేసింది. ర్యాగింగ్ కారణంగా చాలామంది విద్యార్థులు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి మరణాలను అరికట్టడానికి ప్రభుత్వం, కళాశాలల యాజమాన్యం కఠిన చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా యాంటీ ర్యాగింగ్ కమిటీని ప్రతి కళాశాలలోనూ నియమించారు. దీంతో ర్యాగింగ్ కొంతవరకు తగ్గింది. అయితే మళ్ళీ హైదరాబాద్ లో ర్యాగింగ్ మొదలైంది. గత కొద్దిరోజుల క్రితం గాంధీ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కు పాల్పడిన 10 మందిని యాంటీ ర్యాగింగ్ కమిటీ సస్పెండ్ చేసింది. తాజాగా మరో విద్యార్థి ర్యాగింగ్ కు పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆ విద్యార్థిని సస్పెండ్ చేసింది.
