వన్డే ప్రపంచకప్ 2023 (ICC ODI World Cup 2023)లో మరో ఆసక్తికర సమరం శుక్రవారం జరగనుంది. ఐదు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో ఒకసారి చాంపియన్ పాకిస్తాన్ తలపడనుంది. ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ ల్లో రెండింటిలో ఓడి ఒక మ్యాచ్ లో నెగ్గగా.. పాకిస్తాన్ తన చివరి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కూడా కీలకంగా మారింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ భారీ మార్పు చేసింది. వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ ను పక్కన పెట్టింది. అతడి స్థానంలో ఉసామాను తీసుకుంది. ఆస్ట్రేలియా మాత్రం ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనుంది.
తుది జట్లు
ఆస్ట్రేలియా..
మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, జాష్ ఇంగ్లీస్, స్టొయినిస్, స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), జంపా, హేజల్ వుడ్
పాకిస్తాన్..
ఇమాముల్ హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మొహమ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, మొహమ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, ఉసామ మిర్
