AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం ఎందుకు దర్యాప్తు చేయడం లేదు.. రాహుల్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా మంథనిలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో రాహుల్ గాంధీ.. రాష్ట్రంలోని అధికార పార్టీ బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుర్పించారు. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలు బీజేపీకి బీటీమ్‌గా పనిచేస్తున్నాయంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ ఒంటరి కాదని.. బీజేపీ, ఎంఐఎం దానితో కలిసే ఉంటాయంటూ ఫైర్ అయ్యారు. తాను బీజేపీపై పోరాడుతున్నందుకే.. తనపై బీజేపీ ప్రభుత్వం 24 కేసులు పెట్టిందంటూ పేర్కొన్నారు. తన ఎంపీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారని, ఇల్లు కూడా లాక్కున్నారంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా.. పార్లమెంట్‌లో మాట్లాడడానికి మైక్‌ కూడా ఇవ్వరంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌పై కేంద్రం ఒక్క కేసు పెట్టలేదన్నారు. కేసీఆర్‌పై ఈడీ, సీబీఐ దాడులు చేయలేదంటూ రాహుల్‌ వివరించారు. కేసీఆర్‌ అవినీతిపై కేంద్రం ఎందుకు దర్యాప్తు చేయడం లేదంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ కుటుంబపాలనతో తెలంగాణకు తీవ్రనష్టమంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఎంఐఎం దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ సహాయ పడుతోందంటూ ఆరోపించారు. తెలంగాణలో రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని.. పార్లమెంట్‌లో ప్రతి బిల్లుకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చిందంటూ రాహుల్‌ అభిప్రాయపడ్డారు. కర్నాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చాం.. దేశమంతా కాంగ్రెస్‌ గాలి వీస్తోందంటూ పేర్కొన్నారు. ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతారని.. ఇది దొరల తెలంగాణ, ప్రజా తెలంగాణ మధ్య పోరు అంటూ రాహుల్ పేర్కొన్నారు.

బీజేపీతో పోరాడుతున్నానని.. ఆ పార్టీకి మద్దతు ఇచ్చే వారు తనపై విమర్శలు గుప్పిస్తుంటే తన పోరాటం ఎంటో అర్థం అవుతోందంటూ రాహుల్ గాంధీ వివరించారు. ఈ పోరాటం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోందని.. కచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ రాహుల్ పేర్కొన్నారు. ఇక్కడ కేసీఆర్ ఓటమి తప్పదని.. త్వరలోనే ప్రజా పాలన ఏర్పడుతుందంటూ ధీమా వ్యక్తంచేశారు.

పార్లమెంట్‌లో ఓబీసీలు ఎంత మంది ఉన్నారని నిలదీశానని.. దేశాన్ని 90 మంది అధికారులు మాత్రమే పరిపాలిస్తున్నారని.. అందులో ఓబీసీలు కేవలం ముగ్గురేనంటూ మరోసారి పేర్కొన్నారు. అందుకే దేశానికి ఎక్స్‌రే అవసరమని చెబుతున్నానని.. డాక్టర్ దగ్గరకు వెళ్లగానే ఏ రోగమో తెలియాలంటే ఎక్స్‌రే తీసుకు రమ్మంటారు.. అందుకే.. తమ ప్రభుత్వం రాగానే ముందుగా కులగణన చేపట్టే పని చేస్తామంటూ రాహుల్‌.. కులగణన గురించి వివరించారు. అందుకే తాము కులగణన కోసం పోరాడుతున్నామని తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10