AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవిత అరెస్ట్ ఖాయం: కేఏ పాల్

ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం ఖాయమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు.లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఈడీ నోటీసులివ్వడంపై ట్విట్టర్ వేదికగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.రెండు రోజుల పాటు కవితను విచారించి, మార్చి 10న అరెస్టు చేస్తారని జోస్యం చెప్పారు. అది కేసీఆర్ పతనానికి ఆరంభమని అన్నారు. తెలంగాణ రైతులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల కన్నీరు, ఉసురు.. కేసీఆర్ కుటుంబానికి తాకిందని అన్నారు. కేసీఆర్ కుటుంబం.. దేవుడినే శత్రువు చేసుకున్నారని.. అందుకు తగిన శాస్తి జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్లుగా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశాడని.. బీఆర్ఎస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని తెలిపారు. కేవలం ఓట్ల కోసమే పథకాలు తీసుకొచ్చి తర్వాత విస్మరించారని మండిపడ్డారు.

ANN TOP 10