AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. తొలి ఉద్యోగం రజినీకి ఇస్తాం : రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ అనే అమ్మాయికి తొలి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. పీజీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని రజినీ తన ఆవేదనను రేవంత్ కు చెప్పి వాపోయారు. దీనిపై ఆయన స్పందించారు.

డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని.. తమ పార్టీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వస్తారని తెలిపారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ రజనీకి ఉద్యోగం ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఇది తన గ్యారంటీ అని రజనీకి రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డును స్వయంగా రజినీ పేరుతో రేవంత్ రెడ్డి నింపడం విశేషం.

ANN TOP 10