AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీతో కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం.. జూపల్లి సంచలన వ్యాఖ్యలు

బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకోమని తనకు సీఎం కేసీఆర్ చెప్పారంటూ కాంగ్రెస్ పార్టీ నేత జూపల్లి కృష్ణారావు సంచలనానికి తెరదీశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తనపై చేసిన కామెంట్స్‌పై స్పందించారు. తనది అహంకారం కాదని.. ఆత్మగౌరవమన్నారు. తనను బీజేపీ వాళ్ళతో లోపాయికారీ ఒప్పందం చేసుకొమ్మని కేసీఆర్ చెప్పారన్నారు. కేసీఆర్ చెప్పినట్టు వినలేదు కాబట్టే తనకు అహంకారం అని అంటున్నాడన్నారు. కేసీఆర్‌కి బీజేపీతో ఎప్పటి నుంచో లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. తన ప్రభావం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంటుంది కాబట్టే తనను కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతోందన్నారు. డిసెంబర్ 3న మూడు రంగుల జెండా ఎగురుతుందని జూపల్లి తెలిపారు.

ANN TOP 10