AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తన విగ్గు గురించి ఆసక్తికర అంశం వెల్లడించిన బాలయ్య

టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ ఏ విషయమైనా నిర్మొహమాటంగా మాట్లాడతారని ప్రతీతి. తాజాగా తన కొత్త చిత్రం భగవంత్ కేసరి ప్రమోషన్ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ తన విగ్గు గురించి స్పందించారు. ఇటీవల ఓ వ్యక్తి ఈయన విగ్గు ధరిస్తాడు అంటూ హేళనగా మాట్లాడాడని, ఆయనకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చానని బాలయ్య వెల్లడించారు.

అవును… నేను విగ్గు ధరిస్తాను… నువ్వెందుకు గడ్డం పెట్టుకుంటున్నావని అడిగాను అని వివరించారు. తన వ్యవహారం అంతా తెరిచిన పుస్తకం వంటిదని, ఎవరికీ భయపడబోనని స్పష్టం చేశారు.

కెమెరామన్ రామ్ ప్రసాద్ తనకు ఎప్పటినుంచో తెలుసని, తామందరం సినిమా షూటింగుల్లో కలిసే భోజనం చేసేవాళ్లమని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. అవి కారవాన్ లు లేని రోజులని, చాప వేసుకుని నేలపైనే విశ్రాంతి తీసుకునేవాళ్లమని వివరించారు. ఆ సమయంలో విగ్గు తీసేసేవాడ్నని తెలిపారు.

ANN TOP 10