AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై షర్మిల ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు గుప్పించారు. “కొండంత రాగం తీసి పిల్లికూత కూసినట్లుంది కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో. పోయిన ఎన్నికలకు ఇచ్చిన హామీలే నెరవేర్చే దిక్కు లేదు. మళ్లీ కొత్త కథ మొదలు పెట్టిండ్రు. బ్రతుకు మీద ఇవ్వాల్సిన ధీమా పక్కన పెట్టి పోయాక భీమా ఇస్తాడట. సున్నా వడ్డీకే రుణాలు అని మోసం చేసిన దొర. ప్రతి మహిళకు నెలకు రూ. 3 వేలు ఇస్తామనడం హాస్యాస్పదం. నిరుద్యోగ భృతి అని గత మేనిఫెస్టోలో పెట్టిన పథకానికే దిక్కులేదు కానీ.. ఇప్పుడు రూ. 3 వేలు ఇస్తామంటే నమ్మాలా?. విడతల వారీగా పెన్షన్ల పెంపు ఒక పెద్ద జోక్. రుణమాఫీపై దొర యూ టర్న్. ఉద్యోగాలు ఇవ్వలేక ఏనాడో చేతులెత్తేశారు. ఉన్న పథకాలను పాతర పెట్టి ఓట్ల కోసం కొత్త పథకాలు అంటూ డ్రామాలు తప్ప మరోటి లేదు. బందిపోట్లు సమితి మేనిఫెస్టో ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం కాదు.” అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ANN TOP 10