నేహా శెట్టి హాట్ బ్యూటీగానే యూత్ నుంచి మార్కులు కొట్టేస్తూ వస్తోంది. తెల్లని మేనిఛాయతో .. నాజూకుదనంతో .. హాట్ లుక్స్ తో తొలి సినిమాతోనే కుర్రాళ్ల మనసులను రాజేసిన .. కాజేసిన బ్యూటీగా ఆమె పేరు తెచ్చుకుంది. అప్పటి నుంచి ఆ ఇమేజ్ ను నిలబెట్టుకుంటూ వెళుతోంది. ‘డీజే టిల్లు’ సినిమాలో పోషించిన ‘రాధిక’ పాత్ర ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. ఆ పాత్రకి ఆమె ఇచ్చిన గ్లామర్ టచ్ ను యూత్ అలా గుర్తుపెట్టేసుకుంది. ఇక రీసెంట్ గా వచ్చిన ‘బెదురులంక 2012’ .. ‘రూల్స్ రంజన్’ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, గ్లామర్ పరంగా నేహా శెట్టి తన జోరును చూపించింది. త్వరలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది.
