కర్ణాటకలో అదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఏక కాలంలో 12 చోట్ల ఈ దాడులు కొనసాగించారు. కర్ణాటకకు చెందిన పలువురు కాంట్రాక్టర్ల నివాసాలపై ఈ సోదాలు జరిగాయి. మొత్తం ఐదుగురు కాంట్రాక్టర్ల నివాసాలపై ఈ సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. కాంట్రాక్టర్ల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అంబికానాథ్ నివాసంతో పాటు పలువురు కాంట్రాక్టర్ల నివాసాలపై దాడ చేసి తనిఖీలు నిర్వహించారు.
అంబికానాథ్ నివాసంలో నుండి 20 అట్టపెట్టెలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో సుమారు 42 కోట్ల రూపాయలు ఉన్నట్టు ఐటీఅధికారులు గుర్తించారు..ఇలా మొత్తం ఐదుగురు కాంట్రాక్టర్ల నివాసాల నుండి ఐటీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న సొమ్ము అంతా అంబికానాథ్ కు చెందిన ఒక ఫ్లాట్‌లో దాచినట్లు గుర్తించారు. ఈ ఫ్లాట్ తాళం చెవి ఐటీ అధికారులకు ఇచ్చేందుకు మొదట అంబికానాథ్ నిరాకరించాడు. ఎట్టకేల ఆ ఫ్లాట్ తెరిచిన అధికారులు నోట్ల కట్టలు ఉన్న పెట్టెలను చూసి షాక్ అయ్యారు.