AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దళిత బంధు నిలిపివేత..

తెలంగాణ రాష్ట్ర దళితులకు ఊహించని షాక్ తగిలింది. దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సంక్షేమ పథకాలు అన్నిటికీ బ్రేక్ పడింది. దళిత బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ములుగు జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద ఒక బోర్డు పెట్టారు. గమనిక పేరుతో ఎన్నికల నియామవళి 2023 అమలులో ఉన్నందున దళిత బంధువు మరియు ఇతర పథకాలు తాత్కాలికంగా నిలిపివేయడమైనది అని రాసి ఉంది. ఇక అది చూసిన ప్రజలు నిరాశతో వెను తిరుగుతున్నారు.

ANN TOP 10