AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బద్రినాథ్‌ను దర్శించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ..

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) బద్రీనాథ్ ఆలయాన్ని (Badrinath) దర్శించారు. స్వామి వారినీ దర్శించి ఆయన ఆశీర్వదాలు అందుకున్నారు. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ప్రతి యేడాది బద్రీ విశాల్ స్వామికి ప్రత్యేక పూజలలో పాల్గొంటారు.బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ మరియు BKTC మాజీ CEO BD సింగ్ ముఖేష్ అంబానీకి స్వాగతం పలికారు.

బద్రినాథ్ ఆలయాన్ని ముఖేష్ అంబానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా బద్రినాత్ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. ప్రతి యేడాది ముఖేష్ అంబానీ హిమగిరుల్లో కొలువైన ఉన్న బద్రినాథ్‌ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా బద్రినాథ్‌లో కొలువైన ఉన్న స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రముఖులు ముఖేష్ అంబానీకి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్బంగా దేశంతో పాటు ప్రపంచం సుఖ శాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరినట్టు తెలిపారు. ఆ తర్వాత అంబానీ .. కేదార్ నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. గతేడాది కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయాలకు చెరో రూ. 2.5 కోట్ల రూపాయలను విరాళంగా అందజేసిన సంగతి తెలిసిందే కదా.

ముఖేష్ అంబానీ బద్రినాథ్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బద్రినాథుడిపై ముఖేష్ అంబానీ కుటుంబానికి అచంచలమైన నమ్మకం ఉంది. అందుకే ప్రతి యేడాది తప్పకుండా బద్రినాథ్ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ముఖేష్ అంబానీ సాధారణ భక్తుడిలా బద్రి విశాల్ స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలో ఆయన కొంతసేపు ధ్యానం చేశారు.

ANN TOP 10